- Advertisement -
నవతెలంగాణ – రామాయంపేట: రామాయంపేటలోని మహంకాళి మాత దేవాలయంలో శుక్రవారం నుంచి వార్షికోత్సవ వేడుకలు, బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో రవికుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, శనివారం ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుందని తెలిపారు. ఆదివారం ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
- Advertisement -