నవతెలంగాణ-భిక్కనూర్
కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో ఉన్న కేజీబీవీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ మినిమం టైం స్కేల్, కేర్ టేకర్ నియామకం, సమ్మె కాలానికి వేతనం వంటి సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆర్థికేతర అంశాల పరిష్కారం అధికారులతో మాట్లాడి త్వరలోనే ఉత్తర్వులు ఇప్పిస్తామన్నారు. అనంతరం కేజీబీవీ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లగా సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ని, పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి లను కేజీబీవీ ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు కుషాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గిరిధర్, అనిల్ కుమార్, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హరిప్రియ, ఉపాధ్యాయులు, పి ఆర్ టి యు మండల ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES