Saturday, July 19, 2025
E-PAPER
Homeకరీంనగర్మహిళల ఆర్థిక అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యం..

మహిళల ఆర్థిక అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యం..

- Advertisement -
  • – పారిశ్రామికవేత్తలుగా మహిళలు ఎదగాలి: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • – మహిళల పేరు మీదే రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల జారీ..
  • – ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న విప్..
  • నవతెలంగాణ – వేములవాడ
  • మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, మహిళలు ఆర్థిక అభివృద్ధి తోనే దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. గురువారం వేములవాడ పట్టణంలో డిఆర్డిఏ, షేర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు…మహిళల సమైక్య సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజి, ఇటీవల మరణించిన మహిళా సంఘ సభ్యుల ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు.
  • ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారని, అందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించడం జరిగిందని తద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని అన్నారు.
  • అనాడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మేలు జరిగితే మళ్లీ రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో మహిళా తల్లులకు పేద్ధపీఠ వేయడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేశారని, ఐకేపీ కేంద్రాలను ప్రారంభం చేసి మహిళలకు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు 20వేల పైచిలుక కోట్లను కేటాయించడం జరిగిందని అన్నారు.గత ప్రభుత్వం మహిళా సంఘంలను ఏ మాత్రం పట్టించుకోలేదని చివరికి మూడు సంవత్సరాల వడ్డీని ఎగ్గొట్టినట్లు,మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం నూతనంగా అందించే రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లను కూడా మహిళల పేరు మీద మంజూరు చేస్తుందని తెలిపారు. 93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.
  • 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల జమ చేశామని అన్నారు. రైతు భరోసా క్రింద పెట్టుబడి సహాయం ఎకరానికి 12 వేల రూపాయలకు పెంచి 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల జమ చేశామని, రైతు బీమా కు 3 వేల కోట్ల అందించామని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు వారు ఆర్థికంగా ఎదగాలని మైక్రో ఎంటర్ప్రైజేషన్, మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్లో, సోలార్ పవర్ ప్లాంట్, డైరీ యూనిట్స్ వంటి వాటిని ఎర్పాటు చేయడం కోసం బ్యాంకు లింకేజీ వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
  • వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో అయ్యప్ప, శ్రీ ఆదర్శ గ్రామ సంఘాలకు సంబంధించి నాలుగు ఎకరాల భూమిలో నాలుగు కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.36 లక్షలతో మహిళా సమైక్య సంఘానికి ఆర్టిసి బస్సు కొనుగోలు చేసి అందజేయడం జరిగిందని తెలిపారు. 4350 సంఘాలకు 5 కోట్ల 72 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
  • మహిళా సంఘాల సభ్యురాళ్లకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లోన్ బీమా, ప్రమాద బీమా స్కీం వలన ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ప్రమాదవశాత్తు ఎవరైనా సంఘ సభ్యులు చనిపోతే వర్ తీసుకున్న రుణం మాఫీ తో పాటు పదిలక్షల వరకు ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు.ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గంలో 37 మందికి 40.43 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికీ ఆశీర్వాదాలు అందజేయాలని పిలుపునిచ్చారు.
  • ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ శేషాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, చెలకల తిరుపతి, కచకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు,అన్ని మండల ఏపీఎం లు, మహిళా సమైక్య సంఘ అధ్యక్షురాలు, మహిళా సంఘ సభ్యులు, తో పాటు తదితరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -