Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి

మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వన మహోత్సవం కోసం నర్సరీల్లో సిద్ధం చేస్తున్న మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని నర్సరీ నిర్వాహకులకు ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్ సూచించారు. గురువారం మండలంలోని అమీర్ నగర్, దొమ్మరి చౌడు తండా  గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను  ఆయన పరిశీలించారు. మొక్కల సంరక్షణపై నర్సరీ నిర్వహకులకు పలు సూచనలు చేశారు. నర్సరీలో సిద్ధం చేస్తున్న మొక్కల రకాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో నాటేందుకు కావలసిన మొక్కల్ని జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. నర్సరీలో లక్ష్యం మేరకు మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు.ఎండిపోయిన, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కల్ని సిద్ధం చేయాలన్నారు. మొక్కల సంరక్షణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించోద్దని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన  గుంతల్ని ఉపాధి కూలీలతో సిద్ధం చేయించాలని ఈజిఎస్ సిబ్బందికి సూచించారు. 

పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు…
అమీర్ నగర్, దొమ్మరి చౌడు తండా గ్రామ  పంచాయతీ కార్యాలయాలను ఎంపీడీవో సందర్శించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించేందుకు త్వరలో జాతీయ బృందం సభ్యులు వస్తున్నందున నేపథ్యంలో… ఉపాధి పనులు జరిగిన ప్రదేశంలో పెట్టవలసిన బోర్డులు, 7 రికార్డులు, జాబ్ కార్డ్స్ అప్డేషన్, మొదలగు వాటిపై పంచాయతీ కార్యదర్శులకు  సూచనలు చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు శ్రీలత, పద్మ, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -