- – పారిశుధ్యం పనులు ఎప్పటినుండి చేస్తున్నారు…?
- – సొంత ప్రాంగణాన్ని లాభదాయకంగా మార్చండి
- – అశ్వారావుపేట పట్టణాన్ని సుందరీకరణ చేస్తాం
– దొంతికుంట చెరువుకు టాంక్ బండ్… - – మార్నింగ్ వాక్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- నవతెలంగాణ – అశ్వారావుపేట : ఆంధ్రాకు సరిహద్దుగా ఉన్న నియోజక వర్గం కేంద్రం,నూతన మున్సిపాల్టీ గా ఏర్పడిన అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి,సుందరీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణ,సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- గురువారం ఉదయం అశ్వారావుపేట మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి దొంతికుంట చెరువు వరకు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తో సహా ఆయన మార్నింగ్ వాక్ చేసారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ ఎస్ఈ లాల్ సింగ్ తో సెంట్రల్ లైటింగ్,డ్రైనేజ్,రోడ్డు విస్తరణ పనులు ఇంకెంత కాలం చేస్తారు అంటూ మందలించారు.ఎక్కడ చూసినా మట్టి కుప్పలు ఉన్నాయని,కాంట్రాక్టర్ ఎవరు,ఎక్కడ అంటూ ఆరా తీసారు.త్వరగా ముగించాలని ఆదేశించారు.
- పారిశుధ్యం కార్మికులను పలకరించి ఎప్పటి నుండి చేస్తున్నారు?
- మీ తర్వాత ఎవరు చేస్తారు అంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. పట్టణాన్ని శుభ్రంగా ఉంచండి అంటూ కదిలారు. సొంత ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన లాభదాయకంగా మార్చాలని,రహదారికి పక్కగా వ్యాపార సముదాయ భవనాలు నిర్మిస్తే రెవిన్యూ జెనరేట్ అవుతుందని కమీషనర్ బి.నిగరాజు సూచించారు. ప్రజలను పలకరిస్తూ వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చివరిగా దొంతికుంట చెరువును సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే అశ్వారావుపేట మున్సిపాలిటీగా రూపొందించామని,ఈ పట్టణ లో మౌళిక వసతులు కల్పించడంలో నూ, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. దొంతికుంట చెరువు పరిసరాలలో ఎనిమిది మీటర్ల వెడల్పుతో టాంక్ బండ్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని ప్రజల కోసం విశ్రాంతి కేంద్రంగా అభివృద్ధి చేయాలని,వాకింగ్ ట్రాక్ లు, పచ్చదనం కలిగిన పార్కు లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే పట్టణంలోని రహదారుల వెంట చెత్త వెంటనే తొలగించేలా మున్సిపల్ అధికారులను ఆదేశించారు.పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటు,డ్రైనేజీ లైన్ల నిర్మాణం,విద్యుదీకరణ వంటి పనులు విడతల వారీగా చేపడతామన్నారు. ఆంధ్ర,తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీ ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రహదారుల సుందరీకరణ,సెంట్రల్ లైటింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఆయన త్వరితగతిన పూర్తి చేయాలని,ప్రభుత్వం ఆసుపత్రి పై ప్రజలకు నమ్మకం కలిగించాలని ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ విజయ్ కుమార్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్ అండ్ బీ ఎస్ ఈ లాల్ సింగ్,డీఈఈ ప్రకాశ్,ఐబీ ఎస్ ఈ ఎస్.శ్రీనివాసరెడ్డి,ఈఈ సురేష్ కుమార్,డీఈఈ ఎల్.క్రిష్ణ,పంచాయితీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు,డీఈఈ శ్రీధర్,ఏఈఈ అక్షిత,ఆర్డీఓ మధుబాబు,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,విద్యుత్ శాఖ డీఈఈ నందయ్య,ఏడీఈ వెంకటరత్నం,ఏఈఈ రవికుమార్,ఐటీడీఏ ఏటీడబ్ల్యుఓ చంద్ర మోహాన్,డీఈఈ బాపనయ్య లు,నాయకులు జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు,సీ హెచ్ సత్యనారాయణ,మిండ హరిక్రిష్ణ లు పాల్గొన్నారు.