Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రథమ చికిత్సకు గ్రామీణ వైద్యులు ప్రాముఖ్యం..

ప్రథమ చికిత్సకు గ్రామీణ వైద్యులు ప్రాముఖ్యం..

- Advertisement -
  • – రాష్ట్ర ఆర్ఎంపీ ఏథీక్స్ కమిటీ సభ్యుడు తాళ్లపల్లి స్వామి
    – ఎమ్మెల్యే కవ్వంపల్లికి రాష్ట్ర ఆర్ఎంపీల సంపూర్ణ మద్దతు ప్రకటన
  • నవతెలంగాణ-బెజ్జంకి
  • గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర ప్రథమ చికిత్స ప్రాముఖ్యమని.. ఆర్ఎంపీ, పీఎంపీలు సేవలందిస్తున్నారని రాష్ట్ర ఆర్ఎంపీ,పీఎంపీ ఏథీక్స్ కమిటీ సభ్యుడు తాళ్లపల్లి స్వామి ఉద్ఘాటించారు.గురువారం నియోజకవర్గ ప్రజాభవన్ యందు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మండలంలోని ఆర్ఎంపీ, పీఎంపీలు కలిసి సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గ్రామీణ వైద్యులు ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రథమ చికిత్స చేస్తున్నారని.. ఆరోగ్య శాఖ అధికారులు ఆర్ఎంపీ, పీఎంపీలపై కక్ష్యపూరిత దాడులకు పాల్పడడం సరైందికాదని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ప్రజారోగ్యమే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పని చేస్తున్నారని ఆర్ఎంపీ, పీఎంపీలు కొనియాడారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యల పరిష్కారించేల కృషి చేస్తానని భరోసానిచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు రాష్ట్ర ఆర్ఎంపీ, పీఎంపీల ఏథీక్స్ కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆర్ఎంపీల మండల ఉపాధ్యక్షుడు రమేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు జానకి రాములు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -