Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు…

యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు…

- Advertisement -
  • – ఐదేకరాల రైతుకు రెండు బస్తాలే
    – ఆందోళనలో రైతులు
  • – యూరియా కొరత లేదు ఎడిఎ
  • నవతెలంగాణ -పరకాల
  • ఖరీఫ్ పంటలకు కావలసిన యూరియా కోసం రైతులు తిప్పలు పడాల్సి వస్తుంది. సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నప్పటికీ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. గురువారం పరకాల వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద మాదారం, పరకాల వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేస్తుండడంతో అక్కడికి పెద్ద ఎత్తున రైతులు చేరుకొని యూరియా కోసం క్యూ లైన్ కట్టారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ క్యూ లైన్ మధ్యాహ్నం రెండు గంటలకు సైతం కొనసాగడంతో రైతులు లైన్లో నిల్చోలేక పరస్పర అంగీకారంతో చెప్పులను క్యూ లైన్లో పెట్టడం గమనార్హం. వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన తాము క్యూ లైన్లలో నిలబడాల్సి రావటం ఎంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతును రాజును చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇలా క్యూ లైన్ లో నిలబెట్టి యూరియా కోసం బికార్లను చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఓవైపు పరకాల నడికూడ మండలాలకు సంబంధించి ప్రైవేట్ డీలర్ల వద్ద 700 వందల టన్నుల విలువలు ఉన్నట్లు అగ్రికల్చరల్ అధికారుల ద్వారా తెలుస్తోంది.
  • రైతులు సొసైటీల వద్దనే ఎందుకు పడి కాపులు పడాల్సి వస్తుంది. ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేయడానికి ఉన్న అభ్యంతరాలు ఏందనే చర్చలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫర్టిలైజర్స్ యజమానులు యూరియా కొరత ఉందని పుకార్లను సృష్టిస్తూ అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు స్పందించి ఇలాంటి పుకార్లను అరికట్టి రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా అందేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పరకాల-నడికూడ మండలాలకు యూరియా డిమాండ్: వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఈ సీజన్లో పరకాల నడికూడ మండలాలకు సంబంధించి సుమారు 35 వందల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపినట్లు పరకాల ఏడీఏ సోమరాతి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే ఈ రెండు మండలాలకు సంబంధించి పరకాల, మాదారం సహకార సొసైటీలతో పాటు ప్రైవేట్ డీలర్ల ద్వారా సుమారు 980 టన్నుల యూరియా దిగుమతి అయిందన్నారు. ఇందులో మాదారం, పరకాల సొసైటీల నుండి 180 టన్నుల యూరియా ఇప్పటికే పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సొసైటీల వద్ద ఇంకా 170 టన్నుల నిలువలు ఉన్నట్లు ఎడిఎ తెలిపారు. అంతేకాకుండా ప్రైవేట్ డీలర్ల వద్ద సుమారు 7 వందల టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు ఎడిఎ శ్రీనివాస్: రైతులు యూరియా కొరత ఉందని సొసైటీల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదన్నారు.ప్రజల అవసరం మేరకు యూరియా అందుబాటులోనే ఉంటుందన్నారు. కొంతమంది యూరియా కొరత ఉందని చేస్తున్న ప్రచారాన్ని రైతలెవరు నమ్మొద్దన్నారు. రైతుల డిమాండ్ మేరకు యూరియా అందించడం జరుగుతుందన్నారు.
నాకు 5 ఎకరాల వ్యవసాయం ఉంది… రెండు బస్తాలే ఇస్తామంటున్నారు: ముసికె గట్టుమల్లు వరికోలు రైతు: మాదారం సొసైటీలో యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఈరోజు (గురువారం)ఉదయం 6 గంటలక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకున్నాను మధ్యాహ్నం రెండు గంటలు అవుతున్నప్పటికీ నా వంతు రాలేదు. ఎండలో నిలబడలేక నా చెప్పులు లైన్లో పెట్టి ఎదురుచూస్తున్నాను. నాకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కానీ నాకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తామంటున్నారు. అది ఎంత మాత్రం సరిపోదు. ప్రభుత్వం యూరియాను రైతులకు సరిపడా పంపిణీ చేయాలి.

చేన్లో పనిచేసుకోవాల్సినోళ్లం
యూరియా కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా…
రంజిత సర్వాపురం గ్రామ మహిళా రైతు

పరకాల మాదారం సొసైటీలో యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి రెండు రోజులుగా తిరుగుతున్న ఈరోజు(గురువారం) ఉదయం 6 గంటలకే వచ్చినప్పటికీ నా వంతు ఇంకా రాలేదు. చేనులో పని చేసుకోవాల్సిన వాళ్ళం యూరియా కోసమే తిరిగితే ఎట్లా బతికేది. గతంలో ఇంత కొరత ఉండేది కాదు. ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి యూరియా బస్తాలు తెప్పించుకునేవాళ్ళం. మేం చేన్లో పనిచేస్తుండగానే యూరియా తీసుకొచ్చి ఇచ్చేవారు ఆటో డ్రైవర్లు. అలాంటిది ఇప్పుడేమో యూరియా కోసం లైన్లో ఎదురుచూడాల్సి వస్తుంది. రైతును రాజును చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇదేనా రాజును చేయడం అంటే.. యూరియా బస్తాల కోసం బికార్లను చేస్తారా…? యూరియా కొరత లేదనుకుంటానే నాలుగు ఎకరాలు ఉన్న మాకు రెండు బస్తాలు ఇయ్యడమేంది. కొరతే లేకపోతే మాకు అవసరం ఉన్న మేరకు యూరియా బస్తాలు ఇయ్యొచ్చు కదా…?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -