- Advertisement -
- – యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఇంచార్జ్: బద్దం వాసుదేవ రెడ్డి
- నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
- స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసే సత్తా చాటాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్చార్జి బద్దం వాసుదేవ రెడ్డి కోరారు. గురువారం భువనగిరి పట్టణం లోని సితార ఫంక్షన్ హల్ లో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశం జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, జిల్లా ఇంచార్జ్ చంద్రిక, యశ్వంత్ అధ్యక్షతన నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటాలని 100% సీట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పనిచేయాలని యోజన కాంగ్రెస్ కార్యకర్తలకు యువజన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పూర్తిగా స్థానిక సంస్థ ఎన్నికల్లో సీట్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా సైనికుల్లాగా ముందుండి పని చేయాలని క్యాడర్ పూర్తిగా వారి వారి బాధ్యతలకు న్యాయం చేయాలని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టాలని మహిళా సదస్సులు నిర్వహించాలని కోరారు.
- వైట్ టీ షర్ట్ క్యాంపెనింగ్, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచార కార్యక్రమాలు, కేంద్ర మతతత్వ బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యక్రమాలు చేపట్టాలని బూత్ స్థాయి సభ్యుల నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేయాలని అన్నారు. యువజన కాంగ్రెస్లో పనిచేసే వారికి ప్రమోషన్లు పనిచేయని వారికి డిమోషన్లు కచ్చితంగా ఉంటాయని, క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్, పుట్ట గిరీష్,గూడూరు నిఖిల్ రెడ్డి, ఆలేరు అసెంబ్లీ అధ్యక్షుల మంగా కిరణ్, జిల్లా ఉప అధ్యక్షులు బత్తిని వరుణ్ గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు ఏడుమేకల మహేష్ దయ్యాల శ్రీశైలం, మాచర్ల వినయ్, బూరన్, అసెంబ్లీ ఉప అధ్యక్షులు చేకూరి బాలకృష్ణ, లకావత్ సురేష్, వోరిచర్ల బాలు, సందీప్, ప్రధాన కార్యదర్శులు కొంతం నవీన్,పుట్ట శివ ఉడుత కార్తీక్, రుద్ర చందు, గణేష్ రెడ్డి బత్తిని నగేష్, బుగ్గ ఉదయ్, మండల అధ్యక్షులు కనుకుంట్ల కొండల్, కొలను నిఖిల్ రెడ్డి, మైసోళ్ల ప్రవీణ్,గ్యార సందీప్ లు పాల్గొన్నారు.
- Advertisement -