Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఖండేబల్లూల్ ఇందిరమ్మ పథకంలో నిర్మాణాలను పరిశీలించినఎంపీడీవో, ఎంపీవో

ఖండేబల్లూల్ ఇందిరమ్మ పథకంలో నిర్మాణాలను పరిశీలించినఎంపీడీవో, ఎంపీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని ఖండేబల్లూర్ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలు చేస్తున్న వాటిని గురువారం నాడు ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో , ఎంపీవో మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా లబ్ధిదారులు నిర్మిస్తున్న గృహాలను, బేస్మెంట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అంతకుముందు నూతనంగా మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణం కొరకు ముగ్గు వేసి పండ్లను ఎంపీడీవో ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపట్టాలని లేకపోతే బిల్లులు మంజూరు కావని లబ్ధిదారులకు అవగాహన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వాటికి నిబంధనలు ఉండడం వలన వారి పరిధిలోని చేపడితే లబ్ధిదారులకు ఇటు అధికారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన విధంగా ఉంటుందని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఎంపీ ఓ రాము, కాంగ్రెస్ నాయకులు చాకలి కృష్ణ , హనుమారెడ్డి , మాజీ సర్పంచ్ భర్త శివరాజ్ దేశాయ్, మారుతి, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -