Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపూర్ జిపిలో రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో.. 

బస్వాపూర్ జిపిలో రికార్డులను పరిశీలించిన ఎంపీడీవో.. 

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో జిపి రికార్డులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గురువారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ.. జిపి కార్యదర్శి పలు సూచనలు చేశారు. జిపి కార్యాలయంలో అన్ని రకాల రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉంచాలని , పెండింగ్ పెట్టరాదని జిపి అధికారికి సూచించారు . గ్రామాలలో పేరుకుపోయిన పారిశుద్ధ పనులను ఎప్పటికప్పుడు చేయించాలని,  అదేవిధంగా పన్నులను 100% వసూలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ పనులను విను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో దోమల బెడద రాకుండా ముందస్తు చర్యలు చేపట్టి నిత్యం వారానికి రెండుసార్లు ఫాగింగ్ చేయాలని తెలిపారు. త్రాగునీరు ఏర్పాట్లలొ సమస్యలు ఉంటే వెనువెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాలలో గుంతలలో నీళ్లు నిలవకుండా గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని,  లేకుంటే దోమలు నివాసము ఏర్పాటు చేసుకొని లార్వా పెట్టి వేల కొద్ది దోమలు కొత్తవి తయారవుతాయి , అదుకే ముందస్తు చూపుగా దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ పథకంలో నిర్మాణాలు చేస్తున్న ఇంటి నిర్మాణాలను పరిశీలించారు . లబ్ధిదారులతో మాట్లాడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు చేసుకుంటే గ్రీన్ ఛానల్ ద్వారా డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు సూచించారు. పీఎంఏవై యాప్ను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ రాము , కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు . 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -