Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పరిష్కరించాలి

మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పరిష్కరించడంలో ప్రభుత్వాన్ని నిర్లక్ష్యంగా ఉన్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులుదాసరి పాండు అన్నారు. గురువారం రోజున  సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి  పట్టణంలో  ఉన్న మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల సిఐటియు సమావేశం  జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.  మున్సిపల్ పట్టణాల్లో అపరిశుభ్రంగా ఉన్న పట్టణాలను శుభ్రం చేస్తూ   ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూన్న మున్సిపల్ కాంటాక్ట్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం  పర్మినెంట్ చేయకుండా కాంటాక్ట్ విధానం అమలు చేస్తూ కార్మికుల శ్రమకు తగ్గ వేతనం చెల్లించకుండా వెట్టి చాకిరి  చేయించుకుంటున్నదని  ఆరోపించారు. 

కార్మిక చట్టాలు కూడా అమలు చేయడం లేదని ఎన్నో ఆశలతో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని పెరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు చెల్లించాలని స్థానికంగా ఉన్న అధికారులు వేధింపులు ఆపాలని,   ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, బకాయిగా ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని, సబ్బులు, నూనెలు పనిముట్లు సకాలంలో ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న పీఎఫ్ ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామచందర్, వెంకటేశం, ఐలయ్య, రవి, శాంతి కుమార్, రాణి, లక్ష్మీ,  శాంతమ్మ, వరమ్మ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -