- Advertisement -
నవతెలంగాణ – గన్నేరువరం: మైలారం గ్రామ యువకులు ఇంటింటికి తిరుగుతూ.. కప్పతల్లి ఆటను గురువారం ఆడారు. కప్పతల్లి కప్పతల్లి కరుణ చూపించు వానల్లు కురవాలి… మా చెరువులు నిండాలని పాటలు పాడారు. వానదేవుడు కరుణించి భారీ వర్షాలు కురవాలని, మా చెరువులు నిండాలని గ్రామంలో ఇంటింటికి తిరుగగా ప్రజలు బిందెలతో కప్పతల్లి మీద నీళ్లు పోశారు. గ్రామదేవతలకు బిందెలతో జలాభిషేకం నిర్వహించారు.మండలంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పత్తి, మొక్క జొన్న, వరి చేనులు ఎండిపోతున్నాయని గ్రామస్తులు సాంప్రదాయమైన కప్పతల్లి ఆటను ఆడినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -