Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేట్ స్కూల్ లపై చర్యలు తీసుకోవాలి 

ప్రయివేట్ స్కూల్ లపై చర్యలు తీసుకోవాలి 

- Advertisement -
  • – పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేత 
    – పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి 
    – తాడ్వాయి లో ఎస్ఎఫ్ఐ విద్యార్థులు భారీ ర్యాలీ
    – ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగట్టు రవి తేజ 
    నవతెలంగాణ -తాడ్వాయి 
  • మండలంలోని ప్రైవేట్ పాఠశాలలను ఉన్నతాధికారులు తనిఖీ చేసి చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాగటి రవితేజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి సీనియర్ అసిస్టెంట్ నాగేందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 9300 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
  • మండలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలకు పైన వర్షానికి మీరు చిమ్మట పడుతున్నట్లు తెలిపారు. మిస్ చార్జీలను కూడా పెంచి విడుదల చేయాలన్నారు.తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని తెలిపారు. మండలంలోని విద్య సమస్యలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మంకిడి సాయి చైతన్య, కార్యదర్శి తౌసిఫ్ ఖాన్, విద్యార్థి నాయకులు హర్షవర్ధన్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -