Sunday, July 20, 2025
E-PAPER
Homeకరీంనగర్సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

నవతెలంగాణ – గంభీరావుపేట: సైబర్‌ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని గంభీరావుపేట ఎస్ఐ.రమాకాంత్ అన్నారు. గురువారం పోలీసు స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ. రమాకాంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, మీకు తెలియని లింకులు పంపిస్తే ఓపెన్ చేయవద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు విధిగా పాటించాలని,సోషల్ మీడియాపై పోలీసు నిఘా ఉంటుందని జాగ్రత్త వహించాలన్నారు.సీసీ కెమెరాల అవశ్యకతను వివరించి ప్రజలను అవగాహన పరిచారు. అనంతరం గ్రామస్థులు నూతన ఎస్ఐ. రమాకాంత్ శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పర్శరాములు, శ్రీనివాస్, సాయిరాం కృష్ణ, మల్లేష్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -