- Advertisement -
- – యాదవ సంఘం మండల నూతన కార్యవర్గం ఎన్నిక
నవతెలంగాణ – తంగళ్ళపల్లి - యాదవులందరూ రాజకీయంగా ఎదగాలని యాదవ సంఘం నూతన అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గురువారం తంగళ్ళపల్లి మండల నూతన పూర్తి పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో నూతన అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా పూర్తి పాలకవర్గాన్ని ఆయన ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా ఆత్మకూరి చంటి యాదవ్,ఉపాధ్యక్షులుగా మెడ కొక్కుల చరణ యాదవ్,ప్రధాన కార్యదర్శిగా మందాటి తిరుపతి యాదవ్,కోశాధికారిగా మోతే మహేష్ యాదవ్,కార్యదర్శిగా చెన్నవేని తిరుపతి యాదవ్, సహాయ కార్యదర్శులుగా మేఖల రమేష్, అన్నవేని రాజు, సంస్కృతిక కార్యదర్శిగా బొల్ల వేణి ఎల్లం,ప్రచార కార్యదర్శులుగా జక్కుల కొమురయ్య, సింగర వేణి లచ్చయ్య, ముఖ్య సలహాదారులుగా గోట్ల ఐలయ్య,దొంతుల ఆంజనేయులు, అరకుటి మహేష్, కొత్తపల్లి శ్రీనివాస్, బీనవేని మల్లేశం, కార్యవర్గ సభ్యులుగా ఉడతల కుంటయ్య, దొంతుల చంద్రం, దోరగొల్ల రాజేశం, శ్యాగ దేవయ్య,జగ్గాని రాజేశం, మల్లారపు తిరుపతిలు ఏకగ్రీవంగా నియామకమయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా సత్కరించారు.
- Advertisement -