Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొండాలతోగు, జలగలంచ బిడ్జిలకు మరమ్మతులు 

మొండాలతోగు, జలగలంచ బిడ్జిలకు మరమ్మతులు 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలం 163వ జాతీయ రహదారి పస్రా నుండి తాడ్వాయి మధ్యలో గల మొండాలతోగు, జలగలంచ, గుండ్ల వాగు బ్రిడ్జిల మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గతంలో భారీ వర్షాలకు ఈ మూడు బ్రిడ్జిల వద్ద జాతీయ రహదారి ప్రొటెక్షన్ వాల్, కొంత తార్ రోడ్డు కొట్టుకొని పోయి ప్రమాదకరంగా ఏర్పడింది. మొండాలతోగు బ్రిడ్జి ప్రొటెక్షన్ వాల్, జలగలంచ బ్రిడ్జి వద్ద ప్రొటెక్షన్ వాల్ , రిటర్నింగ్ వర్క, గుండ్ల వాగు వద్ద కొట్టుకుపోయిన తారు రోడ్డు ఈ పనులు గత రెండు రోజులుగా ముమ్మరంగా సాగుతున్నాయి. గుత్తేదారు పిన్నింటి యాదిరెడ్డి దగ్గరుండి పనులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం నేషనల్ హైవే ఈ ఈ రామ్మూర్తి పనులను పరిశీలించారు. పనులను నాణ్యతగా పూర్తి చేయాలని సూచించారు. జరుగుతున్న పనులకు సంతృప్తి వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -