- Advertisement -
- – అరకొర వేతనాలు ఇచ్చిన పని చేసినం
- – ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి
- నవతెలంగాణ – మల్హర్ రావు
- చాలి చాలని వేతనాలతో మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామపచాయితీలో సపాయి కార్మికులుగా నాలుగేళ్లు వెట్టి చాకిరి చేసినం, ప్రస్తుతం అధికారులు బడ్జెట్ లేదు, స్థానిక ఎన్నికల తరువాత చూస్తాం మీరు పనికి రావద్దంటున్నారని సపాయి తాత్కాలిక సపాయి కార్మికులు ఇందారపు సమ్మయ్య, కాల్వ పోచాలు, కేశారపు మల్లమ్మ, ఇందారపు పోచాలు, ఇందారపు రవి, దామెర రవి గురువారం విలేకరుల సమావేశంలో వాపోయారు. ఈ సందర్భంగా మాట్లాడారు తమ సపాయి పని ఆన్లైన్లో నమోదు చేయిస్తానంటే తాజా మాజీ సర్పంచ్ సతీమణికి వేలల్లో ఆమ్యామ్యాలు ఇచ్చినట్లుగా తెలిపారు. పని త్వరగా అవుతుంది అంటే పాలక వర్గానికి పెద్దయెత్తున దవాత్ సైతం ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.అరకొర వేతనాలైన సరేని రోడ్లు, డ్రైనేజీల్లో ఉన్న చెత్త,చెదారం పరిశుభ్రం చేస్తే నాలుగు నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాపోయారు.ఇప్పటికైనా సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించి తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.
- Advertisement -