Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిష్టాపురంలో విరబూసిన విద్యా కుసుమం సుస్మిత

కిష్టాపురంలో విరబూసిన విద్యా కుసుమం సుస్మిత

- Advertisement -

– సర్కారు బడిలో చదివి ఐఐటీలో సీటు సాధించింది
– ల్యాప్ టాప్ బహుకరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
– 50 వేలు ఆర్థిక సహాయం చేసిన కొండ కృపాకర్ రెడ్డి
– సుస్మితను ఘనంగా సత్కరించిన గ్రామస్తులు
నవతెలంగాణ – రాయపర్తి
ఒకటవ తరగతి నుండి మొదలు ఇంటర్ వరకు సర్కారు పాఠశాల, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యను అభ్యసించిన సుస్మిత చిన్నతనం నుండే చదువుపై ఆసక్తిని పెంచుకొని క్రమశిక్షణతో కూడిన కటోర శ్రమ చేసి ఐఐటి వారణాసిలో సీటు సంపాదించి తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామస్తులకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళితే మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన గిద్దె రేణుక – మహిపాల్ దంపతుల కుమార్తె సుస్మిత నర్సరీ నుండి ఐదవ తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. తదుపరి పదవ తరగతి వరకు మహబూబాబాద్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యను అభ్యసించింది.

అనంతరం మడికొండ సోషల్ వెల్ఫేర్ లో ఇంటర్ పూర్తి చేసింది. గురువుల ప్రోత్సాహంతో ఐఐటీ వారణాసి యూనివర్సిటీలో ఫ్రీ సీటు సంపాదించింది. కటిక పేదరికంలో పుట్టి సర్కారు విద్యనే అభ్యసించి ప్రఖ్యాతిగాంచిన ఐఐటి వారణాసిలో సీటు సాధించడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ల్యాప్ టాప్ బహూకరించారు. గురువారం గ్రామంలో గ్రామ పుర ప్రముఖులు కొండ కృపాకర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు సుస్మితను ఘనంగా సన్మానించి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గట్టు నరసింహచార్యులు ఐదు వేల  రూపాయలను అందజేశారు. సుస్మితకు మునుముందు కూడా గ్రామస్తులం అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట సోమనర్సయ్య, కత్తి రవీందర్, చందు విష్ణుమూర్తి, కునుసోతు శ్రీను, వల్లపు వెంకన్న, కునుసోతు సజ్జన్, సంకినేని నవీన్, అనుముల యాదయ్య, గిద్దె యాకయ్య, సమ్మయ్య, గిద్దె సాయిలు, గౌరారపు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -