Saturday, July 19, 2025
E-PAPER
Homeకరీంనగర్కుక్కల బెడదను నివరించాలి...

కుక్కల బెడదను నివరించాలి…

- Advertisement -
  • – చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో సందర్శన
    – రామరవుపల్లి, సనుగుల కార్యదర్శులకు పరిశుభ్రత పై ఆదేశాలు
    – మర్రిగడ్డ లో పవన్ కుమార్ పర్టిలైజర్ షాప్ లో తనిఖీలు చేసిన
    – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
    నవతెలంగాణ – చందుర్తి: కుక్కల బెడదను నివారించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించగా రామారావు పల్లి గ్రామంలో కుక్కల సమూహం ను చూసి వెంటాన్నే కార్యదర్శిని వాటిని నివారించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు.సనుగుల గ్రామంలో పర్యటించి సానిషన్ సరిగలేకపోవడం తో గ్రామ పంచాయతీ సిబ్బందికి చర్యలు చేపట్టాలని తెలిపారు. చందుర్తి సొసైటీ ఎరువుల గోదాం లో పరిశీలించి ఎరువుల కొరత పై అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు మర్రిగడ్డ గ్రామంలో పవన్ పరిలైజర్ దుకాణంలో తనిఖీలు నిర్వహించి స్టాక్ నిలువ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఎరువుల కొరత సృష్టించవద్దని హెచ్చరించారు.నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కేసులు చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం,స్థానిక వ్యవసాయ అధికారిని శిరీష,పౌర సంబంధాల అధికారి శ్రీధర్ ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -