Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఒకే గది ఐదు క్లాసులు

ఒకే గది ఐదు క్లాసులు

- Advertisement -

– 23 మంది విద్యార్థులు
– ఇద్దరు ఉపాధ్యాయులు
– ప్రహరీ లేని పాఠశాల
– పాములు తిరుగుతున్న వైనం
నవతెలంగాణ – మాక్లూర్ 

విద్యార్థుల అవసరాల కోసం ప్రభుత్వాలు అనేక వసత్యులు కల్పిస్తున్నమని ప్రగడ్బాలు పలుగుతున్నప్పటికి క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్నంగా ఉంటుంది. అరకొర వసతుల మధ్య విద్యార్థులకు విద్యను బోధించడానికి సరైన వసతులు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మండలంలోని దాస్ నగర్ సమీపంలో 63వ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు కొనసాగుతుంది. అందులో ఒకటవ తరగతిలో ఇద్దరు, రెండవ తరగతిలో ఆరుగురు, మూడవ తరగతిలో తొమ్మిది మంది, నాల్గవ తరగతిలో ఒక్కరు, ఐదవ తరగతిలో ఐదుగురు మొత్తం 23 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఇద్దరు ఉపాధ్యాయులు విద్యను బోధిస్తున్నారు. ఐదు తరగతులు కలిసి ఒకే గదిలో విద్య బోధన కొనసాగుతుంది. ఒకటవ తరగతి విద్యార్థికి చెప్పే పాఠం ఐదవ తరగతి విద్యార్థులకు, ఐదవ తరగతి విద్యార్థులకు చెప్పే పాఠం ఒకటవ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు.

     నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లి 63వ జాతీయ రహదారిని అనుకొని ఉన్న పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు రొడ్డుపైకి వెళితే అంతే సంగతి, పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు పెరుగడంతో పాములు సైతం వస్తున్నాయి.  విద్యార్థులు ఆడుకోవడానికి వీలులేకుండా ఉంది. దాస్ నగర్ మున్సిపాలిటీలో రెండవ డివిజన్ లో ఉండటం వల్ల మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి పాఠశాల ఆవరణంలో శుభ్రం చేయకపోవడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. గతంలో కార్పొరేటర్ ఉండటం వల్ల ఆయనకు చెప్పితే శుభ్రం చేయించేవారు. ప్రస్తుతం పట్టి చుకునే వారు లేరు.పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని, అదనపు గదులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -