ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిం చిన ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం.జ్యోతి కష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు.ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ‘దర్శకుడు క్రిష్ నా పాత్ర గురించి, కథ గురించి చెప్పినప్పుడే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. అయితే అదష్టం కొద్దీ పవర్‌స్టార్‌తో ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం రావడమే కాకుండా.. పంచమి అనే శక్తివంతమైన పాత్ర కూడా లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్‌కి, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్‌తో ఒక్క సినిమా చేసినా ఒకటే. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ కల్పిత పాత్రను తీసుకొని ఈ కథ రాశారు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కనిపిస్తారు. ఓ రకంగా ఇండియానా జోన్స్ సినిమాకి ఇండియన్ వెర్షన్ ఇది. దర్శకుడు జ్యోతి కష్ణ సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నిర్మాత ఎ.ఎం.రత్నం చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు.