- Advertisement -
నవతెలంగాణ -ముధోల్: మండలంలోని రామ్ టెక్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ సాయినాథ్ ( 24) యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై బిట్ల పెర్సెస్ కథనం ప్రకారం… మృతుడు సాయినాథ్ హంగిర్గా వైపు నుండి రాంటెక్ వైపు వస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ప్రైవేట్ వాహనంలో బైంసా ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి బార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమెరకే కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ వివరించారు
- Advertisement -