Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంసెమీకండక్టర్‌కు ఆమోదం తెలపండి

సెమీకండక్టర్‌కు ఆమోదం తెలపండి

- Advertisement -

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ

రాష్ట్రంలో సెమీకండక్లర్‌ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదం తెలపాలని రైల్వే శాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజీ టెక్నాలజీస్‌ (ఏఎస్‌ఐపీ) ప్రాజెక్ట్‌, మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ప్రాజెక్ట్‌ క్రిస్టల్‌ మ్యాట్రిక్స్‌కు తెలంగాణలో ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు గురువారం నాడిక్కడి రైల్వే భవన్‌లో కేంద్ర మంత్రితో ఆయన భేటీ అయ్యారు. మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎంపీలు పీ బలరాంనాయక్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేశ్‌ షెట్కార్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద తెలంగాణ వినతిని పరిశీలించాలని కోరారు. రీజినల్‌ రింగు రోడ్డు సమీపంలో నూతన ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్క్‌ను ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేయగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. హైదరాబాద్‌ రీజినల్‌ రింగు రోడ్డుకు సమాంతరంగా రీజినల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్టును ప్రతిపాదించామనీ, దీనికి రైల్వే బోర్డు ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు అనుమతి ఇచ్చిందన్నారు. రూ.8 వేల కోట్ల విలువైన ఈ రీజినల్‌ రింగ్‌ రైలు ప్రాజెక్ట్‌కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ డ్రైపోర్ట్‌ నుంచి బందరు ఓడ రేవుకు అనుసంధానంగా రైలుమార్గం మంజూరు చేయాలని కోరారు. కాజీపేట రైల్వే డివిజన్‌ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల అనుసంధానత, పారిశ్రామిక, వ్యవసాయ ఎగుమతులు, దిగుమతుల కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నూతన రైలు మార్గాలు మంజూరు చేయాలని కోరారు. వాటిలో వికారాబాద్‌-కృష్ణా (122 కిలో మీటర్లు- అంచనా వ్యయం రూ.2,677 కోట్లు), కల్వకుర్తి-మాచర్ల (100 కిలో మీటర్లు-అంచనా వ్యయం రూ.2 వేల కోటు)్ల, డోర్నకల్‌-గద్వాల (296 కిలో మీటర్లు-అంచనా వ్యయం రూ.6,512 కోట్లు), డోర్నకల్‌-మిర్యాలగూడ (97 కిలో మీటర్లు అంచనా వ్యయం 2,184 కోట్లు) మార్గాలను వంద శాతం రైల్వే శాఖ వ్యయంతో మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -