లండన్ : లేబర్ పార్టీ మాజీ నేత, స్వతంత్ర వామపక్ష పార్లమెంట్ సభ్యుడు జెరిమి కార్బిన్ కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నారు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు ఇది నిజమైన ప్రత్యామ్నాయంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. లేబర్ పార్టీలో కొన్ని రోజుల కిందటి వరకు అత్యంత పిన్న వయస్కురాలైన జురా సుల్తానా కూడా ఈ కొత్త పార్టీ నిర్మాణంలో చేతులు కలుపుతున్నారు. పాలక పార్టీ నుండి జులై 3నే ఆమె బయటకు వచ్చారు. ఇప్పటివరకు ఈ కొత్త పార్టీకి పేరు పెట్టలేదు. కానీ రాజకీయ పరిశీలకులు మాత్రం అప్పుడేదీనిపై విశ్లేషణలు జరుపుతున్నారు. కార్బిన్ నేతృత్వంలోని ఈ పార్టీకి 18శాతం మంది బ్రిటన్లు ఓటు వేసే అవకాశం వుందని యువ్‌గవ్ గత వారం అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 10శాతం ఓట్లను ఆకర్షించే అవకాశం వుందని మరికొన్ని సంస్థలు విశ్లేషించాయి. కొత్తగా ఏర్పాటు చేసే ఈ వామపక్ష భావజాల పార్టీ బ్రిటన్‌లో మనగలిగే పరిస్థితులు వున్నాయా లేదా అన్నది ఇప్పుడు పరిశీలించాల్సిన అంశంగా వుంది. దశాబ్దాల తరబడిదేశంలో ప్రధానంగా రెండు పార్టీల వ్యవస్థే నెలకొని వున్న తరుణంలో కొత్తగా మూడో పార్టీ రావడం ఎంతమేరకు ఉపకరిస్తుందన్నది తెలియడం లేదు. గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న సుదీర్ఘ యుద్ధం కొత్త పార్టీకి ముఖ్య అంశంగా మారినట్లు కనిపిస్తోంది. కార్బిన్, సుల్తానాలు ఇజ్రాయిల్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తమ పార్టీ శాంతియుత విదేశాంగ విధానాన్నే అవలంబిస్తుందని కార్బిన్ చెప్పారు.న
జెరిమి కార్బిన్ నేతృత్వంలో బ్రిటన్‌లో కొత్త పార్టీ !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES