Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంరుషికొండ బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతి

రుషికొండ బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌లో ఆదివారం ఉదయం స్నానానికి దిగిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరిలో అరవింద్ అనే బిటెక్ విద్యార్థి మృతి చెందగా, రాజీవ్ అనే మరో యువకుడిని లైఫ్ గార్డ్స్ కాపాడారు. పోలీసులు రాజీవ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బీచ్‌లో స్నానానికి వచ్చిన ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు బయట ఉండగా.. రాజీవ్, అరవింద్ స్నానానికి దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో బీచ్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -