Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఒక్క లేఖతో డీల్‌ కుదిరినట్టే

ఒక్క లేఖతో డీల్‌ కుదిరినట్టే

- Advertisement -

తుదిదశకు భారత్‌తో వాణిజ్య ఒప్పందం : ట్రంప్‌
ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్‌ విధానాలతో భారత్‌ మార్కెట్‌లోకి అమెరికా ప్రవేశం
వైట్‌హౌస్‌:
భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం తుదిదశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. ఒక్క లేఖ పంపితే ఇండియాతో డీల్‌ కుదిరినట్టేనని స్పషం చేశారు. బుధవారం బహ్రెయిన్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ సల్మాన్‌ బిన్‌ హమద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాతో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ట్రంప్‌ విలేకరులతో మాట్లాడారు. భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ గురించి తెలిపారు. ఆగస్టు1 నుంచి తాము విధించే టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి. ఆ రోజు తమకు ఎంతో కీలకమైనదనీ, అలాగే తమ దేశానికి చాలా సంపద రానున్నట్టు ట్రంప్‌ పేర్కొన్నారు.

”ఇప్పటి వరకు అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. 100 బిలియన్‌ డాలర్లకుపైగా సేకరించాం. మంగళవారం కూడా మరో దేశంతో ఒప్పందం కుదిరింది. ఇప్పుడు భారత్‌తో మరో డీల్‌ ఓకే కానుంది. ఆగస్టు 1న అమెరికా ఖజానాకు పెద్ద మొత్తంలో డబ్బులొచ్చే రోజవుతుంది. ఇప్పటి వరకు స్టీల్‌, ఆటోమొబైల్‌ తప్ప టారిఫ్‌లు పెద్దగా అమల్లోకి రాలేదు. కానీ ఆ రోజుతో భారీ మార్పులు ఉండ నున్నాయి”అని ట్రంప్‌ వెల్లడించారు. భారత్‌ మార్కెట్‌లోకి అమెరి కాకు పూర్తి ప్రవేశం కల్పించేలా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతు న్నాయని ట్రంప్‌ తెలిపారు. ‘ఇప్పటివరకు మా ఉత్పత్తులకు భారత్‌ సహా పలు దేశాల్లో ప్రవేశం లేదు. ఇప్పుడు టారిఫ్‌ల కారణంగా ఆయా దేశాలు ప్రవేశం కల్పిస్తున్నాయి. భారత్‌తో డీల్‌ చివరి దశలో ఉంది. ఒక లెటర్‌ పంపితే అది ఉత్తమ డీల్‌ కానుంది. ఆ లేఖలో 30శాతం, 35శాతం, 25శాతం, 20శాతం టారిఫ్‌లు చెల్లించాలని చెబుతాం’ అని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.

20శాతం టారిఫ్‌ తప్పదా?
ట్రంప్‌ మాటలను పరిశీలిస్తే భారత్‌పై టారిఫ్‌లు 20 నుంచి 35 శాతం మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇండోనేషియాపై అమెరికా 19శాతం టారిఫ్‌ను విధించింది. ఈ క్రమంలో అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక బంధం నేపథ్యంలో మన దేశంపై అంతకంటే తక్కువగా టారిఫ్‌లను ట్రంప్‌ విధిస్తారని భారత్‌ భావించింది. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
అమెరికా ఉత్పత్తులపై భారతదేశం విధిస్తున్న అధిక టారిఫ్‌లు ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ప్రధాన సమస్యగా ట్రంప్‌ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ‘భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. అయితే, ఇండియా టారిఫ్‌లను తగ్గించేందుకు సన్నద్ధంగా ఉన్నారు’ అని ఇటీవల బ్రైట్‌బార్ట్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పేర్కొన్నారు.

మరోపక్క భారత్‌, అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు (బీటీఏ) ప్రధాని మోడీ, డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాల మేరకు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఐదో రౌండ్‌ చర్చలు జరపడానికి మా బృందం తిరిగి అమెరికాకు వెళ్లింది. కాబట్టి ఆ ఒప్పందం ఇరు దేశాల నాయకుల నిర్ణయాల ప్రకారం జరుగుతుంది’ అని అధికారులు చెప్పారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -