- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయుని టీఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ మాట్లాడుతూ హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా అత్యుత్తమ సేవలందించారని కొనియాడారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా చేసిన సమయంలోనూ ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన సేవలు దేశానికి, తెలుగు రాష్ట్రాలకు ఇంకా అవసరముందన్నారు.
- Advertisement -