– కార్యాలయాన్ని నడిపిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు
– సోదాల్లో రూ.7550 నగదును గుర్తించిన అధికారులు
నవతెలంగాణ-సదాశివపేట
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 7,550 నగదును గుర్తించినట్టు తెలిపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్‌కు అనుమతి ఉండదన్నారు. రిజిస్ట్రేషన్ చేపించేవాళ్లు, అమ్మే వాళ్ళు మాత్రమే కార్యాలయంలో ఉండాలని తెలిపారు. కానీ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లు లేనిదే పని జరగడం లేదని తెలుస్తుందని అన్నారు. అలాగే, ఎలాంటి లావాదేవీలకు సంబంధం లేని రూ.7,550 నగదు గుర్తించామన్నారు. రిజిస్ట్రార్ క్యాబిన్‌లో క్రయవిక్రయదారులు మాత్రమే ఉండాల్సి ఉండగా, ఏకంగా 12 మంది ఉన్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్లను డిస్పాచ్ చేయాలని, కానీ దాదాపు 30 రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉన్నాయని అన్నారు. అదేవిధంగా ఫ్లాట్స్, వెంచర్స్‌లలో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లపై వాటి యజమానుల ఫోన్ నంబర్లు మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుందని, కానీ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ఫోన్ నంబర్లు ఎంటర్ చేసి ఉంచడాన్ని గమనించామని తెలిపారు. అదేవిధంగా కార్యాలయంలోని ఫైల్స్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని వెల్లడించారు. ఈ సోదాల్లో ఏసీబీ అధికారులు రమేష్, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘పేట’ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES