Sunday, July 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసచివాలయంలో బోనాల వేడుక

సచివాలయంలో బోనాల వేడుక

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో గురువారం బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సచివాలయ ఉద్యోగుల సంఘం, నల్ల పోచమ్మ దేవస్థానం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. నార్త్‌ గేట్‌ నుంచి బాహుబలి గేట్‌ మీదుగా సౌత్‌ గేట్‌, పోచమ్మ దేవాలయం వరకు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. డప్పు విన్యాసాలు, పోతరాజుల ప్రదర్శనలు భక్తులకు కనువిందు చేశాయి. సచివాలయ అధికారులు, సిబ్బంది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గిరి శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు నవీన్‌ కుమార్‌, లావణ్య లత, జనరల్‌ సెక్రెటరీ ప్రేమ్‌, అదనపు కార్యదర్శి రాము భూక్య, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -