Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల పింఛన్‌ రూ. 6వేలకు పెంచాలి

వికలాంగుల పింఛన్‌ రూ. 6వేలకు పెంచాలి

- Advertisement -

వారి ప్రాతినిధ్యం కోసం చట్టం చేయాలి
వికలాంగులను మోసం చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం : ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య
కలెక్టరేట్‌ ఎదుట వికలాంగుల ధర్నా
నవతెలంగాణ-సంగారెడ్డి
వికలాంగుల పింఛన్‌ రూ. 6 వేలకు పెంచా లని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల ప్రాతి నిధ్యం కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని ఎన్‌పీ ఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య డిమాండ్‌ చేశారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట వికలాంగులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా పింఛన్‌ ఎందుకు పెంచడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పింఛన్‌ పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తామని హెచ్చరించారు. వికలాంగులకు ఇచ్చిన మాటతప్పిన ముఖ్య మంత్రికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. పింఛన్‌ పెంపు కోసం 42 లక్షల మంది చేయూత లబ్దిదారులు ఎదురుచూస్తున్నారని, రాష్ట్రంలో 24.85 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. వికలాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేసి, మూసేసిన టీసీపీసీ కేంద్రాలను పున: ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో టీసీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేయా లని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టాలు చేసి అమలు చేస్తున్నార న్నారు. తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి అనేక మంది వికలాంగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగవైకల్యం ఏర్పడటానికి కారణమవుతున్న పరి శ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇండ్లలో వికలాంగులకు ప్రాధా న్యత ఇవ్వడం లేదనీ, 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం ఇందిరమ్మ ఇండ్లలో 25 శాతం అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వికలాంగుల చట్టా లను అమలు చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక ల్లోపు పెన్షన్‌ పెంచకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు యం.బస్వరాజు, కార్యదర్శి కొనింటి నర్సిములు, జిల్లా ఉపాధ్యక్షులు జయలక్ష్మి, రాంచందర్‌, రాజ్‌కుమార్‌, రాములు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -