నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదిభట్ల వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కారులోనుంచి అతికష్టంమీద బయటకు తీసి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను అక్కడి నుంచి తొలగించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మాలోత్ చందులాల్ (29), గగులోత్ జనార్దన్ (50), కావలి బాలరాజు (40)గా గుర్తించారు.