నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజులుగా పాకిస్థాన్ లో భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈక్రమంలో ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జన జీవనం స్తంభించి, జనావాసాలు నీటిలో మునిగికోట్టుపోతున్నాయి. అయితే ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ వరద ధాటిని లైవ్‌లో రిపోర్టింగ్ చేయడానికి తన ప్రాణాల మీదకు తెంచుకున్నాడు. దాదాపు తన ఎత్తుతో సమానంగా ఉధృతంగా ప్రవాహిస్తున్న వరద నీటిలో నిలబడి లైవ్ రిపోర్టింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో క్రమేణా నీటి వేగం పెరగడంతో..సదురు రిపోర్టర్ వరద ధాటికి గల్లంతు అయ్యారు. వరద తీవ్రతకు అతను గల్లంతైనట్లు అల్ అరేబియా ఇంగ్లీష్ న్యూస్ తన సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. పలువురు టీవీ చానల్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
లైవ్ రిపోర్ట్ ఇస్తూ గల్లంతైన రిపోర్టర్..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES