Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలులోకేశ్‌ నాకు మంచి మిత్రుడు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్‌

లోకేశ్‌ నాకు మంచి మిత్రుడు.. కలిస్తే తప్పేంటి: కేటీఆర్‌

- Advertisement -

నవతెలంగాణ – హైరదాబాద్: ఏపీ మంత్రి లోకేష్ తో భేటీపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌ను తాను క‌ల‌వ‌లేద‌ని అన్నారు. లోకేష్‌ను అర్ద‌రాత్రి క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఏంటని.. కావాలంటే ప‌గ‌లే క‌లుస్తాన‌ని అన్నారు. నారా లోకేశ్‌ నాకు మంచి మిత్రుడు.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. అయినా క‌లిస్తే త‌ప్పేంటని ప్ర‌శ్నించారు. తెలంగాణ నీళ్లు చంద్ర‌బాబుకు.. నిధులు రాహుల్ గాంధీకి వెళుతున్నాయ‌ని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక పొంగులేటికి కాంట్రాక్టులు వ‌చ్చాయ‌ని విమ‌ర్శించారు. కొడంగ‌ల్ లిఫ్ట్ ఇరిగేష‌న్ లో రూ.4వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారన్నా.

పొంగులేటి ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డినా ఈడీ ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంతో ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. ఏ అనుమతితో బనకర్ల కడుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఏ రైతు క్షేత్రానికి వెళ్లినా రైతులు నిలదీస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి తనకు ఏ సవాల్, ఎక్కడ చేసినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన బీసీ సబ్ ప్లాన్ ఏమైందని ప్రశ్నించారు. సీఎంకి ఎప్పటికీ కేసీఆర్ స్థాయి రాదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజం లేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -