అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలి
సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి
నవతెలంగాణ – కంఠేశ్వర్
పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు వెంటనే అప్రూవ్ చేయాలి అని, అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలి అని సీపీఐ(ఎం) నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు సీపీఐ(ఎం) నగర కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల పొందాలంటే తెల్ల రేషన్ కార్డుతో ముడిపడి ఉంది. కాబట్టి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
అలాగే ఎమ్మార్వో ఆఫీస్ ల వద్ద దళారులు మేము త్వరగా చేపిస్తాము అని డబ్బులు తీసుకుని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అని ఇన్ని రోజులు వెబ్సైట్ వర్క్ ఆగిపోయింది అని అధికారులు చెప్తున్నారు. దళారులు, అధికారుల మధ్యలో ప్రజలు నలుగుతున్నారు. ఎలాంటి కారణాలు ఎదురైనా ఈ వంకతో రేషన్ కార్డుల వెబ్సైట్ ఆపేయకూడదని సీపీఐ(ఎం) కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. లేదంటే నిరుపేదలకు రేషన్ కార్డులు వచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యవర్గ సభ్యులు కటారి రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు వెంటనే అప్రూవ్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES