- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 14న ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదైనందున ఇకపై రాజకీయాల్లో కొనసాగకూడదని భావించి పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి పల్లా శ్రీనివాసరావుకి రాజీనామా లేఖ పంపారు.
- Advertisement -