Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ జూలై 23న విద్యాసంస్థల బంద్

ఆదిలాబాద్ జూలై 23న విద్యాసంస్థల బంద్

- Advertisement -

బంద్ ను జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమొల్ల కిరణ్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

విద్యారంగ పరిరక్షణ కోసం బలోపేతం కోసం, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా జూలై 23న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందును నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమొల్ల కిరణ్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బందును చేపడుతున్నట్లు తెలిపారు. విద్యా వ్యాపారానికి కార్పొరేటీకరణకు కాషాయకరణను అనుమతించేలా తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో ఫీ రెగ్యులేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ ఏం.ఈఓ, డీఈఓ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా చెల్లించకుండా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30% నిధులను కేంద్ర ప్రభుత్వం 10% నిధులను బడ్జెట్లలో కేటాయించాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న బంద్ ను విద్యార్థులు విద్యా సంస్థల యజమానులు తల్లిదండ్రులు మేధావులు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గేడం కేశవ్, పిడీఎస్.యూ  జిల్లా కార్యదర్శి మడావి గణేష్, నాయకులు మారుతి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొట్నాక్ సక్కు, ప్రశాంత్  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -