Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుల దురహంకారంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలి

కుల దురహంకారంతో దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలి

- Advertisement -

కాంగ్రెస్ నార్సింగ్ మండల పార్టీ నాయకుడు అంచనూరి రాజేష్
నవతెలంగాణ – రామాయంపేట
: కాంగ్రెస్ పార్టీకి చెందిన పదవుల విషయమై మాట్లాడుదామని పిలిచి, కుల దురహంకారంతో, తిడుతూ దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన సంపత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని నార్సింగ్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అడ్వకేట్ అంచనూరి రాజేష్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రామాయంపేట సీఐ వెంకటరాజ గౌడ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంచనూరి రాజేష్ మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ పదవుల విషయమై మాట్లాడేందుకు సంపత్ రెడ్డి తనను ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు పిలిచారని తెలిపారు.

పార్టీ పదవుల గురించి చర్చిస్తున్న సమయంలో, మా రెడ్డిలకు కాకుండా బీసీలకు ఎలా పదవులు ఇస్తాంరా అంటూ సంపత్ రెడ్డి నోటికొచ్చిన బూతులు తిడుతూ తనపై దాడి చేశారని వివరించారు. దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మనిషిని అని, పార్టీలో తాను చెప్పిందే నడవాలని సంపత్ రెడ్డి తనను కొట్టారని రాజేష్ ఆరోపించారు. ఈ ఘటనపై మూడు రోజుల క్రితమే రామాయంపేట సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, ఈరోజు మరోసారి సీఐని కలిసి తన పరిస్థితిని వివరించానని అంచనూరి రాజేష్ తెలిపారు. సీఐ వెంకటరాజ గౌడ్ సానుకూలంగా స్పందించి, తనపై దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -