Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశాడంలో గోరంటాకు పెట్టుకోవడం సాంప్రదాయం

ఆశాడంలో గోరంటాకు పెట్టుకోవడం సాంప్రదాయం

- Advertisement -


నవతెలంగాణ – పెద్దవూర
ఆశాడమాసంలో మహిళలు, గొరంటాకు పెట్టుకోవడం మన సంస్కృతి సంప్రదాయమని మండల విద్యాశాఖాధికారి తరిరాము అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన  గోరింటాకు పండగలో పాల్గొని మాట్లాడారు. ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకును సంప్రదాయ పద్దతిలో పెట్టుకుంటారని అన్నారు. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్దినులు చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టు కోవడం ఇది సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ఆషాడ మాసంలో గోరింటాకును నూరి, చేతులకు పెట్టుకుంటే, శరీరానికి కూడా ఎంతో మంచిదని, గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని తెలిపారు.

గ్రీష్మంలో మన శరీరంలో వేడి ఎక్కువగా ఉండి,బయటి వాతావరణం చల్లగా ఉంటుందని దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి, జ్వరాలు, అనారోగ్య సమస్యలు, వస్తూ ఉంటాయని అన్నారు. గోరింటాకు లోని ప్రత్యేక గుణం వల్ల, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని అందుకే ఆషాడంలో గోరింటాకు అరచేతిలో, పాదాలకు  గోరింటాకు తప్పక పెట్టుకోవాలని అన్నారు ప్రధానో పాధ్యాయురాలు లక్ష్మిప్రభ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, బ్యూలా, నరేందర్, చంద్రమౌళి, మహేష్, సీఆర్పీ పరమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -