- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట : మండల పరిధిలోని చెన్నారం ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉత్తంగా సరఫరా చేసిన నోట్ బుక్కులను హెడ్మాస్టర్ కందికొండ శ్రీనివాసులు పంపిణీ చేశారు. పాఠశాలలో ఒకటి నుంచి ఏడు తరగతులు నిర్వహిస్తున్నారు మొత్తం 74 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో విద్యార్థులకు కేవలం బోధన పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షించడానికి నూతనంగా రాత బుక్కులు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని పేద వర్గాల పిల్లలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింలు, అర్జున్ గౌడ్, రెహనా బేగం, జనార్దన్ కవిత, ఉన్నారు.
- Advertisement -