Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం 

కస్తూర్బా పాఠశాలలో వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలోని కస్తూర్బా గురుకుల పాఠశాలలో శుక్రవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 160 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొనగా, ఆరోగ్య సమస్యలు ఉన్న 30 మందికి పరీక్షలు నిర్వహించి, 17 మందికి రక్త పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నీటిని వేడి చేసి చల్లార్చి, వడపోసి త్రాగాలని సూచించారు. జ్వరం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే వార్డెన్ గాని, వైద్య సిబ్బంది గానీ తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ జానకమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ పవన్, ఏఎన్ఎం గాoగమణి, ఆశాలు మంజుల, ప్రమీల, కస్తూర్బా ప్రిన్సిపాల్ వనిత, ఏఎన్ఎం రజిత లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -