బీఆర్ఎస్ మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్
నవతెలంగాణ – మద్దూరు
పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండేది బిఆర్ఎస్ జెండా మాత్రమేనని మద్దూరు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని గాగిల్లాపూర్, వంగపల్లి, గ్రామాలలో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి నుండి నేటి వరకు పేద ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేది ఒక బిఆర్ఎస్ జెండా మాత్రమేనని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో భారతదేశంలో మొదటి స్థానంలో మాజీ సీఎం కేసీఆర్ నిలిపారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమ మల్లేశం, మాజీ సర్పంచులు బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి, గంగి భాగ్యలక్ష్మి శ్రీనివాస్,పిఎసిఎస్ డైరెక్టర్ మేక మల్లేశం, గ్రామ శాఖ అధ్యక్షులు చెవిటి మహేష్, సారయ్య, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు అండ బీఆర్ఎస్ జెండా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES