Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతు సంఘం ఏకగ్రీవ ఎన్నిక 

తెలంగాణ రైతు సంఘం ఏకగ్రీవ ఎన్నిక 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
రామారెడ్డి మండల తెలంగాణ రైతు సంఘం మండల కమిటీని శుక్రవారం జిల్లా కార్యదర్శి మొతి రామ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సుధాకర్, ఉపాధ్యక్షులుగా మొగులయ్య, మాన్సింగ్, కార్యదర్శిగా నారాయణ, సహాయ కార్యదర్శులుగా నరేష్, దేవి సింగ్, కమిటీ సభ్యులుగా రాజయ్య, బాబు మోహన్, హైమద్, జవహర్, సాయిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మొతిరాం నాయక్ మాట్లాడుతూ…. భవిష్యత్తులో రైతు సమస్యలపై రైతులంతా ఐక్యంగా రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాడాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ గడ్డమీద 9 నెల్ల పాటు పోరాడినటువంటి సంఘం రైతు సంఘం అని అన్నారు. మోడీ మెడలు వంచి మూడు చట్టాలను రద్దు చేయించిన ఘనత ఏఐకేఎస్ రైతు సంఘాని దాని  అన్నారు.. జిల్లా రైతు సమస్యల పోరాటానికి రైతులంతా ఏకమై ఉండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -