Saturday, July 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ ఆస్పత్రిలో లిఫ్ట్ రిపేర్.. రోగుల అవస్థలు

ప్రభుత్వ ఆస్పత్రిలో లిఫ్ట్ రిపేర్.. రోగుల అవస్థలు

- Advertisement -

ఇబ్బందులు పడుతున్న బాలింతలు, గర్భవతులు
నవతెలంగాణ – అచ్చంపేట :
పట్టణంలో ప్రభుత్వం నిర్మించిన ప్రాంతీయ ఆస్పత్రిలో లిఫ్ట్ రిపేర్ అయింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తు మూడో అంతస్తు లోకి వెళ్లడానికి ప్రధానంగా బాలింతలు గర్భవతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నెలలో 45 డెలివరీలు చేశారు. బాలింతలు రెండు అంతస్తులు ఉంటున్నారు. చిన్నపిల్లలు పరీక్షించే గది (వార్డు)  గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. దీంతో శిశువులకు వైద్యం పరీక్షలు చేయడానికి కుటుంబ సభ్యులు, బాలింతలు ఇబ్బందులు పడుతూ మెట్ల ద్వారా  గ్రౌండ్ ఫ్లోర్ లోకి వస్తున్నారు. పట్టించుకోవలసిన అధికారులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆస్పత్రికి వచ్చిన రోగులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడం వల్ల రోగులు అవస్థలు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే లిఫ్టు మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -