Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇదేం ఆస్పత్రి.. వీళ్ళేం డాక్టర్లు 

ఇదేం ఆస్పత్రి.. వీళ్ళేం డాక్టర్లు 

- Advertisement -

మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత
ఉదయం 10:30 కావస్తున్న డాక్టర్ ఏరీ
ఆస్పత్రి నుంచి సూపరిండెంట్ కు ఫోన్ చేసిన మాజీ ఎంపీ
సూపరిండెంట్ నుంచి నిర్లక్షపు సమాధానం
సచ్చిన శవాలతో జాగారం చేయాలా 
పోస్టుమార్టం చేసుకునేందుకు ఎన్ని తిప్పలు?
అన్నా ఇంత దారుణం ఏంటిది 
స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఫోన్లో ఫిర్యాదు 
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం 

“ఇదేం ఆస్పత్రి.. వీళ్ళేం డాక్టర్లు. ఉదయం 10:30 కావస్తుంది. ఒక్క డాక్టర్ అందుబాటులో లేరు. సచ్చిన శవాలతో జాగారం చేయాల్సిందేనా” అంటూ మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోతు కవిత ఫైర్ అయ్యారు. ఆస్పత్రి సూపరెండెంట్ కి ఫోన్ చేసి మాట్లాడితే కూడా నిర్లక్ష్యం సమాధానం రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఫోన్ చేసి విషయం వివరించారు.”ఇదేంటన్న.. ఆస్పత్రి పరిస్థితి ఇలా ఉంది. సచ్చిన శవాలకు పోస్టుమార్టం చేసుకునేందుకు కూడా ఇన్ని తిప్పలు పడాల్నా అన్న. ఇంత దారుణం ఏంటిది” అంటూ వాపోయారు. ఇది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి తీరు. 

శుక్రవారం తెల్లవారుజామున ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు మహబూబాబాద్ నియోజవర్గానికి చెందిన వారు కావడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి మాజీ ఎంపీ మాలోజు కవిత ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో చేరుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. చనిపోయిన భౌతిక కాయలకు పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్లు అందుబాటులో లేరు వెంటనే ఆస్పత్రి సూపర్డెంట్ కు డా ఫోన్లో సమాచారం అందించారు.

అవుటర్ రింగ్ రోడ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలోని మృతులకు పోస్టుమార్టం చేయాలని డాక్టర్లు అందుబాటులో తీసుకురావాలని ఫోన్ చేస్తే సుపరిండెంట్ నుంచి నెలల చెప్పు సమాధానం ఎదురయింది. ఉదయం 10:30 కాబోతున్న ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం పైగా నిర్లక్ష్యం సమాధానం రావడంతో ఆగ్రా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుదరపేట దూరంలో ఉన్న ఆసుపత్రి పరిస్థితినే ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సచ్చిన శవాలకు కూడా పోస్టుమార్టం చేసుకునేందుకు జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి ఫోన్ చేసి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల పనితీరుపై వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉండని  ప్రభుత్వ డాక్టర్లు ఒక క్షణం కూడా ఉండడానికి వీలులేదని తక్షణమే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

పోస్టుమార్టం అయ్యే వరకు ఇదే ఆస్పత్రిలో ఉంటానని వెంటనే పోస్టుమార్టం చేసేలా డాక్టర్లతో మాట్లాడాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని ఆమె కోరారు.  ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటని, కనీసం వారికి మానవత్వం కూడా లేదని ప్రశ్నించారు. అందుబాటు లేకుండా చూడలే కాకుండా, డాక్టర్లకు ఫోన్ చేసి అడిగితే ఎంపీగా పని చేసిన తనకే రూల్స్ గురించి చెబుతున్నారని కవిత మండిపడ్డారు. మృదేహాలు తీసుకొని 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని డాక్టర్ కు ఫోన్లో వివరించిన కనీస స్పందన లేదని.. పేద ప్రజలు అంటే ఇంత నిర్లక్ష్యమా అంటూ ఎంపీ కవిత విమర్శించారు. ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి సైతం అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 91 అధికరణతో మాట్లాడి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్యే మల్ రడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఆస్పత్రి వద్ద జరిగిన ఘటనపై అక్కడే ఉన్న ఆదిభట్ల సీఐకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -