Saturday, July 19, 2025
E-PAPER
Homeజిల్లాలుకమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కు వినతి..

కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కు వినతి..

- Advertisement -

నవతెలంగాణ- డిచ్ పల్లి : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఇందల్ వాయి గ్రామానికి చెందిన యాదవ సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు కమ్యూనిటీ భవన నిర్మాణానికి  నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సానుకూలంగా స్పందించి, తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు సంఘ సబ్యులు తెలిపారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఇందల్ వాయి మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, యాదవ సంఘం అధ్యక్షులు గొల్ల లింగం, సంఘ మండల కార్యదర్శి బొట్టు శీను, గొల్ల రాంబాబు, జక్కుల లింబాద్రి, భోగం ప్రశాంత్, లోకని గంగారాం తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -