- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ లో ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నించదానికి పత్రికలు, టి వి చానళ్ళు న్యాయస్థానాలు ఉన్నాయి కానీ దాడులు సమంజసం కాదు. ఇలాంటి దాడుల సంస్కృతికి తేరేలేపొద్దు.నిజామాబాద్ లో రాజకీయంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది దానిని దాడులతో విబేధాలు సృష్టించవద్దు. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- Advertisement -