– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అన్ని గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగాపూర్ గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గ్రామస్థాయి సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్లలో ఉన్న నిల్వ నీటిని పారబోయించి ఫ్రైడే డ్రైడే పాటించే విధంగా అవగాహన కల్పించాలని కోరారు.
మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, మురుగునీటి గుంతల్లో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయించాలని, గ్రామ పంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చెల్లించాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి బ్లీచింగ్ పౌడర్ చల్లడం, పాడైన వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఏఎన్ఎం అరుణకుమారి, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి శుక్రవారం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES