నవతెలంగాణ – జుక్కల్
మండలంలో కంఠాలి ఎంపియుపిఎస్ పాఠశాలలో జుక్కల్ ఎస్సై పాఠశాలలోని విద్యార్థులందరికీ తన స్వంత ఖర్చులతో సుమారుగా రూ.8 వేలతో ఐడి కార్డులు, టై, బెల్టులు చిన్న తరగతి పిల్లలకు బ్యాగులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల విద్యాధికారి శ్రీ తిరుపతయ్య, జుక్కల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హనుమంత్ రెడ్డి, ఎస్సై నవీన్ చంద్రను శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎస్సైని పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెట్టి సంతోష్ కుమార్, అరుణ్ పటేల్, ప్రభాకర్ దేశాయ్, శ్రీ రంగ్, జల్ సింగ్, మనోహర్ పాటిల్ నాగ్ రావు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు యాదవ్, బాలు, లక్ష్మీ బాయి, మమత, పాఠశాల విద్యార్థిని , విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
సొంత నిధులతో విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేసిన ఎస్సై నవీన్ చంద్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES