బెంగళూరు: కనెక్ట్ ఇండియా, ఆవిష్కార్ క్యాపిటల్ మద్దతుతో నడిచే కంపెనీ, బెంగళూరుకు చెందిన అగ్రిప్లాట్‌ఫారమ్ ఫార్మ్స్ యొక్క లాజిస్టిక్స్ విభాగంతో విలీనం కావడంతో ‘భారత్ సప్లై’ అనే కొత్త సంస్థ రూపుదిద్దుకుంది. ఈ సంస్థ మెట్రోయేతర మరియు గ్రామీణ మార్కెట్లపై దృష్టి సారిస్తూ, భారతదేశపు అతిపెద్ద లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌గా ఎదుగుతోంది. ఇప్పటికే 5,000 మంది స్థానిక శ్రామిక శక్తిని సమకూర్చిన భారత్ సప్లై, 230 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, దేశంలోని సుమారు మూడింట ఒక వంతు గ్రామాలైన 200,000 గ్రామాలను చేరుతోంది.
చివరి మైలు డెలివరీ మరియు విక్రేత పికప్‌ల నుండి సెంటర్ కార్యకలాపాలు, గిడ్డంగుల నిర్వహణ మరియు లైన్ హాల్ సేవల వరకు, భారత్ సప్లై పూర్తిస్థాయి లాజిస్టిక్స్ పరిష్కారాన్ని అందిస్తోంది. ఈ సమగ్ర సేవల శ్రేణి ద్వారా సంస్థ MSMEలు, ఈకామర్స్ సంస్థలు, వ్యవసాయ సంస్థలు మరియు ప్రధాన కార్పొరేట్ల వంటి విస్తృత ఖాతాదారులకు సేవలందిస్తోంది.మెట్రోపాలిటన్ నగరాలు మరియు పట్టణాలకు మించిన మార్కెట్లపై ప్రత్యేక దృష్టితో, భారత్ సప్లై భారతదేశపు అతిపెద్ద టెక్నాలజీ ఆధారిత డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం ఇది 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, మెట్రోలకు మించి సేవల పరంగా వెనుకబడిన ప్రాంతాలపై అధిక ప్రాధాన్యతనిస్తుంది. గుజరాత్ నుండి అస్సాం, అండమాన్ నుండి జమ్మూ & కాశ్మీర్ వరకు విస్తరించి, 24 గంటల డెలివరీ సేవలను అందిస్తోంది. లాజిస్టిక్స్, టెక్నాలజీ, కస్టమర్ సర్వీస్, ఆపరేషన్స్ మరియు ఆన్-గ్రౌండ్ అమలు వంటి కీలక వ్యవస్థలపై బలమైన బృందాల మద్దతుతో, భారత్ సప్లై ప్రస్తుతం దేశంలో వేగంగా విస్తరిస్తున్న సరఫరా మరియు పంపిణీ నెట్‌వర్క్‌లలో ఒకటిగా అవతరించింది.
“ఈ వ్యూహాత్మక విలీనం భారతదేశంలో లోతైన ఉనికిని కలిగి, విస్తరించగల మరియు ప్రభావవంతమైన వ్యాపారాలను అభివృద్ధి చేయాలన్న మా దృష్టికి అనుగుణంగా సాగుతోంది,” అని మిస్టర్ వినీత్ రాయ్, వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్, అవిష్కార్ గ్రూప్ తెలిపారు.భారత్ సప్లై ద్వారా మేము లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మాత్రమే కాదు, ఆర్థిక చేరికను కూడా విస్తరిస్తున్నాము” అని ఆయన పేర్కొన్నారు.
భారత్ సప్లైకు ఆవిష్కార్ క్యాపిటల్, కాంటీ & కో వ్యవస్థాపకుడు మరియు సీరియల్ ఆంట్రప్రెన్యూర్ కార్నెలియస్ (కానీ) బోయర్ష్, సింగపూర్ కేంద్రంగా ఉన్న ఫ్యామిలీ ఆఫీస్ బ్లాక్ కైట్ క్యాపిటల్, అలాగే వెంచర్ క్యాటలిస్ట్ మరియు 9యూనికోర్న్స్ సహవ్యవస్థాపకుడు అపూర్వ రంజన్ శర్మ, భారతి ఫ్యామిలీకి చెందిన రమిత్ మిట్టల్3one4 క్యాపిటల్, ఇతర భారతీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారుల మద్దతు లభించింది.”సాంకేతిక పరిజ్ఞానంతో సాంప్రదాయ మౌలిక సదుపాయ లోపాలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం భారతదేశాన్ని లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఆవిష్కరణ ఆధారిత వృద్ధికి కేంద్రంగా నిలబెడుతోంది. భారత్ సప్లై నెక్స్ట్ 500 మిలియన్ల వినియోగదారుల కోసం సమ్మిళిత లాజిస్టిక్స్ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టడం, మేము ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో సాధించిన విజయాన్ని ప్రతిబింబిస్తుంది” అని మిస్టర్ కార్నెలియస్ (కోనీ) బోర్ష్ పేర్కొన్నారు.
“భారతదేశంలోని గ్రామీణ మరియు పాక్షిక-పట్టణ మార్కెట్లు వినియోగించని అపార సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. లోతైన లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు మరియు సమగ్ర అమలు ద్వారా ఆ అవకాశాన్ని అన్లాక్ చేయడంలో భారత్ సప్లై ప్రత్యేక స్థితిని కలిగి ఉంది. ఇది కేవలం వ్యాపార అవకాశమే కాకుండా, లక్షలాది మందికి దీర్ఘకాలిక విలువను అందించే అవకాశం కూడా” అని మిస్టర్ కోహ్ బూన్ హ్వీ, బ్లాక్ కైట్ క్యాపిటల్, ప్రిన్సిపాల్ వ్యాఖ్యానించారు.
భారత్ సప్లైకి ఫార్మ్స్ సహ వ్యవస్థాపకులు తరణ్బీర్ సింగ్ మరియు అలోక్ దుగ్గల్ నాయకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ వ్యాపార విస్తరణకు అవసరమైన వాణిజ్య మేనేజ్‌మెంట్ మరియు అగ్రిటెక్ అనుభవాన్ని వారు తీసుకువస్తున్నారు. వ్యూహాత్మక దిశ, రంగ నైపుణ్యం పరంగా అవిష్కార్ క్యాపిటల్ కీలక భాగస్వామిగా కొనసాగుతోంది.
“భారత్ సప్లైలో, మేము కేవలం లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మాత్రమే కాదు, వాస్తవానికి వాణిజ్యానికి వెన్నెముకగా మారే ఓ మౌలిక వ్యవస్థను నిర్మిస్తున్నాము. మారుమూల గ్రామంలోని రైతు అయినా, లేదా టైర్III పట్టణంలో ఉన్న చిన్న పారిశ్రామికవేత్త అయినా, మెట్రో నగరాల్లోని వినియోగదారుల్లా ఒకే స్థాయి డెలివరీ అనుభవాన్ని పొందేలా చేయడమే మా లక్ష్యం,” అని తరణ్బీర్ సింగ్ అన్నారు.
భారత్ సప్లైను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం, యాజమాన్య లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, లోతైన భౌగోళిక ఉనికి, మరియు రియల్ టైమ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌ల సమన్వయం ద్వారా దేశంలోని అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా 24 గంటల డెలివరీని అమలు చేసే సామర్థ్యం. సంస్థ, సమ్మిళిత ఉపాధికి అంకితంగా పని చేస్తూ, సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో గిగ్ కార్మికులు, వ్యవస్థాపకుల భాగస్వామ్యంతో తమ సేవలను విస్తరిస్తోంది. అంతేకాదు, ఈ విస్తృత శ్రేణి గమ్యస్థానాల్లో తమ డీలర్లు, పంపిణీదారుల కోసం లైన్ హాల్ అవసరాలను తీర్చేందుకు బ్రాండ్లకు అనుకూల పరిష్కారాలను కూడా రూపొందించింది.2025 ముగిసే నాటికి 300కు పైగా జిల్లాల్లో కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంతో, భారత్ సప్లై దేశవ్యాప్తంగా తమ పరిధిని పెంచాలని సంకల్పించింది. వేగంగా విస్తరిస్తున్న తమ నెట్‌వర్క్ ద్వారా, భారత్ సప్లై పాన్-ఇండియా విస్తరణను లక్ష్యంగా పెట్టుకున్న బ్రాండ్లకు నమ్మకమైన, సమర్థవంతమైన గో-టు లాజిస్టిక్స్ భాగస్వామిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.