నవతెలంగాణ – తిమ్మాజిపేట
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై కొంతకాలంగా ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో ఆర్ అండ్ బి, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో మురుగు నీటిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సంబంధిత అధికారులకు కనపడడం లేదా అని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గుంపల్లి అశోక్, అంతటి కాశన్న, నాయకులు వెంకటేష్, సుభాష్, కురుమయ్య, మల్లికార్జున్, తదితరులు వున్నారు.
రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES